E-Paper
Useful Links
BIODATA
Enquiry Form
క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోదరుడు హత్య కేసులో పాల్ నిందితుడు. ఒంగోలులోని సెంట్రల్ పార్క్హోటల్‌లో బస చేసిన పాల్‌ను ఈరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్కు ఆయన తమ్ముడు డేవిడ్‌రాజు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలో 2010 జనవరిలో డేవిడ్ హత్యకు గురయ్యాడు.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి దగ్గర ఇన్నోవా కారులో డేవిడ్ మృతదేహాన్ని కనుగొన్నారు. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిందని భావించినా సీటు విరిగిపోయి ఉండడం, డేవిడ్ ముక్కు నుంచి రక్కం కారడాన్ని గమనించిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. పాల్‌కు చెందిన గమ్ చారిటీ వ్యవహారాలే హత్యకు దారి తీసి ఉంటాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో గతంలోనే కొందరిని అరెస్ట్ చేయగా నాటి నుంచి కేసు దర్యాప్తులో ఉంది. కాగా తనను అరెస్ట్ చేయవద్దంటూ కేఏపాల్ కోటి రూపాయలు లంచం ఇవ్వచూపినట్లు తాలూకా సీఐ ఆరోపించారు. ఇందు కోసం మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు ఆయన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Tue, May 22 20:00(IST) Qualifier 1 T.B.C. vs T.B.C. Subrata Roy Sahara Stadium, Pune
Wed, May 23 20:00(IST) Eliminator T.B.C. vs T.B.C. M.Chinnaswamy Stadium, Bengaluru
Fri, May 25 20:00(IST) Qualifier 2 T.B.C. vs T.B.C. MA Chidambaram Stadium, Chennai
Sun, May 27 20:00(IST) Final T.B.C. vs T.B.C. MA Chidambaram Stadium, Chennai
రాజస్థాన్ రాయల్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ముంబై లీగ్ దశను ఘనంగా ముగించింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (36 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ (17 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఒవైస్ షా (24 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) రాణించారు. ముంబై ఇండియన్స్ జట్టు 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 163 పరుగులు సాధించి అలవోకగా నెగ్గింది. ఓపెనర్లు సచిన్ (51 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు), డ్వేన్ స్మిత్ (58 బంతుల్లో 87 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) స్మిత్, సచిన్ తొలి వికెట్‌కు జోడించిన 163 పరుగులు ఐపీఎల్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో డెక్కన్ చార్జర్స్ జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై గెలిచింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా డెక్కన్ చార్జర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డుమిని (53 బంతుల్లో 74; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీతో డీసీ పోరాడటానికి కావలసిన స్కోరు అందించాడు. బెంగళూరు బౌలర్ వినయ్ (3/22) రాణించాడు. రాయల్ చాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. స్టెయిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకూ తెలంగాణ, రాయలసీమల మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి యథాతథంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం రాత్రి వెల్లడించింది. దీని ప్రభావం వలన వచ్చే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కాగా, ఆదివారం దక్షిణ కోస్తాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఉత్తర కోస్తాలో సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా గాలులు వీచడం వలన ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.
It looks like life is Light, Camera and Love’ for the choreographer turned director Prabhu Deva. Prabhu has been very much in the news for his relationship and break up with South actress Nayanthara. But, Prabhu is not amongst those who will sit and cry over his failed relationship.
Talking to a leading daily about his present love life, Prabhu Deva said that he is currently dating films only.In short, he is not in love with anyone at present. But, this doesn’t mean that the dance guru is not open to love.He further clarifies that he can fall in love anytime as ‘Life is unpredictable.On the professional front, Prabhu Deva has proved himself a successful director with his movie Wanted, which had Salman Khan in the lead. Prabhu’s upcoming directorial venture Rowdy Rathore is also expected to do well at the Box Office.