దేశవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. నేటినుంచి ఉపవాస దీక్షలు ఆరంభం కానున్నాయి. హైదరాబాద్‌లో ఆకాశంలో నెలవంక కనిపించనప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయని రువాయత్ హిలాల్ కమిటీ ప్రకటించింది. ఆకాశంలో నెలవంక కనిపించిన వెంటనే రంజాన్ పర్వదినాలు ప్రారభమైనట్లు ప్రకటించింది. నెలవంక దర్శనం కాగానే రాత్రి ప్రత్యేక నమాజు(తారావీ)తో ఈ మాసం ప్రారంభమవుతుంది. తెల్లవారుజాము సహర్‌తో ఉపవాస దీక్షల కోసం ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. గల్ఫ్ దేశాల్లో ఆదివారం నెలవంక దర్శనమీయడంతో అక్కడ సోమవారం నుంచే రంజాన్ ప్రారంభమైంది.
