న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ స్పీకర్ మీరాకుమార్ అపాయింట్‌మెంట్ లభించింది. తమ రాజీనామాలతో ఇచ్చిన సమయంలో స్పీకర్‌ను కలవలేకపోవటంతో మీరాకుమార్ తన నివాసానికి వెళ్లిపోయారు. దాంతో ఎంపీలు మరోసారి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈరోజు సాయంత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వటంతో అప్పటివరకూ పార్లమెంట్ కార్యాలయంలోనే వేచి ఉండాలని ఎంపీలు నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్ వల్ల సకాలంలో చేరుకోలేకపోయామని, స్పీకర్ వచ్చాక రాజీనామాలు సమర్పిస్తామని ఎంపీ రాజయ్య తెలిపారు.
