న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రులకు ఢిల్లీలో చుక్కెదురైంది. 12 మంది మంత్రులతోపాటు వంద మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపిలు రాజీనామా చేసినా కేంద్రంలో చలనంలేదు. మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చినా వారికి పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఏమీ లభించలేదు. దాంతో వారిలో కొందరు ఈరోజు తిరుగుప్రయాణం అవుతున్నారు. మరి కొందరు రేపు బయలుదేరతారు. తెలంగాణ నేతల డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. మంత్రులతో ఉదయం సమావేశమైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్­ఛార్జి గులాంమ్­నబీ ఆజాద్­ కూడా ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు. మరోవైపు కేంద్ర మంత్రి చిదంబరం సంప్రదింపులు కొనసాగుతాయని మాత్రమే చెప్పారు. దాంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనైయ్యారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
ఈ పరిస్థితులలో మరికొంత సమయం ఎదురు చూస్తామని ఎంపిలు చెప్పారు.

Print Friendly

Leave a Reply