Published On: Thu, Nov 1st, 2012

159 MCA Colleges Zero Admissions

159 ఎంసీఏ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ రెండో దశ కౌన్సెలింగ్ అనంతరం భారీగా సీట్లు మిగిలాయి. రాష్ట్రంలోని 159 ఎంసీఏ కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరలేదు. 29 ఎంబీఏ కాలేజీల్లోనూ సున్నా ప్రవేశాలే ఉన్నాయి. రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా చేపట్టిన సీట్ల కేటాయింపు వివరాలను ప్రవేశాల క్యాంపు ఆఫీసర్ రఘునాధ్ బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం కాలేజీలను ఎంపిక చేసుకున్న వారంతా ఈనెల 5వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

  • రాష్ట్రంలో 447 ఎంసీఏ కాలేజీలు ఉండగా 159 కాలేజీల్లో సున్నా అడ్మిషన్లే.
  • 898 ఎంబీఏ కాలేజీలు ఉండగా 29 కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరలేదు.
  • మరోవైపు 9 మందిలోపు విద్యార్థులు చేరిన ఎంబీఏ కాలేజీలు 82 ఉండగా, ఎంసీఏ కాలేజీలు 107 ఉన్నాయి.
  • 10 నుంచి 19 మందిలోపు చేరినవి ఎంబీఏలో 88 కాలేజీలు, ఎంసీఏలో 49 కాలేజీలున్నాయి.

159 MCA Colleges Zero Admissions | Though 129 MCA colleges and 402 MBA colleges recorded 100 per cent admissions, as many as 159 MCA colleges witnessed zero admissions in the Icet seat allotment list that was released on Tuesday.

Print Friendly