4న మూకుమ్మడిగా రాజీనామాలు
హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలు నేరుగా స్పీకర్‌కే సమర్పించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ హాలు వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమైన విషయం తెలిసిందే. సమాశం ముగిసిన అనంతరం మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ డిసెంబరు 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంపిలు లోక్‌సభ స్పీకర్‌కు తమ రాజీనామాలు సమర్పిస్తారని ఎంపి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ స్పీకర్‌కు తమన రాజీనామాలు సమర్పిస్తారన్నారు.















