AP Universities Teachers pay arrears
వర్సిటీ అధ్యాపకులకు బకాయిలు చెల్లింపు
యూనివర్సిటీ అధ్యాపకులకు 2006 పీఆర్‌సీ ప్రకారం సవరించిన వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.165 కోట్లకు ట్రెజరీ ఆంక్షలను ఎత్తివేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఈ నిధులకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంతో సంబంధిత యూనివర్సిటీల పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు వీటిని సర్దుబాటు చేయాలని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ జీఓలు 796, 799, 801 జారీ చేశారు. AP Universities Teachers pay arrears | Andhra Pradesh UNIVERSITIES – Revision of Pay Scales | State Government universities demanding payment of pay arrears












