Andhra Pradesh VRO VRA Written test Answer Key and Solution 2012 will available very soon. Now appeared candidates are looking VRO VRA Answer Sheet and Solution 2012 online. The Govt. of Andhra Pradesh will conducts Village Revenue Officers (VRO) and Village Revenue Assistants (VRA)written test on Jan 2012. Appeared candidates are search answer key and solution online.ఈ నెల 12న వీఆర్‌ఓ & వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలతోపాటే తుది ‘కీ’ కూడా విడుదల
హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల తుది కీని ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఈ నెల 2న (శుక్రవారమే) ఫైనల్ కీ విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే ఈ పరీక్షలను నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ) అధికారులు ఎంసెట్ తరహాలోనే పరీక్ష ఫలితాలతోపాటే తుది కీ విడుదల చేస్తే బాగుంటుందని రెవెన్యూ ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో అధికారులు దీనిపై మరోసారి చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని నిర్ణయించుకున్నారు. ‘‘అన్ని అంశాల్లో ఎంసెట్ మార్గదర్శకాలనే పాటించి పరీక్షలు నిర్వహించాం. అదే తరహాలో ఈ నెల 12న పరీక్ష ఫలితాలతోపాటే తుది ‘కీ’ కూడా విడుదల చేయాలని యోచిస్తున్నాం’’ అని రెవెన్యూ వర్గాలు చెప్పాయి.
