గ్రూపు-4 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంపు
గ్రూపు-4 జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు నిర్వహించే రాత పరీక్షకు హాజరయ్యేందుకు ఈనెల 28లోగా పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించే గడువును పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈనెల 30 వరకు ఉన్న గడువును జూలై 5 వరకు పొడిగించామని ఆమె వెల్లడించారు. రాత పరీక్షను ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.
