AU Incharge Registrar Uma Maheswara Rao
ఏయూ రిజిస్ట్రార్‌గా ఉమామహేశ్వరరావు
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పలు కీలక పదవులు భర్తీ అయ్యాయి. ఉపకులపతి ఆచార్య పి.జార్జి విక్టర్ ఆమోదంతో ఏడుగురు అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. వర్శిటీ రిజిస్ట్రార్‌గా అనవర్తిత గణిత శాస్త్ర విభాగ ఆచార్యులు వి.ఉమామహేశ్వరరావు, రెక్టార్‌గా రసాయన శాస్త్ర విభాగ ఆచార్యులు ఏ.వి.ప్రసాదరావు నియమితులయ్యారు. వీరితో పాటు అకడమిక్ స్టాఫ్ కళాశాల సంచాలకులుగా రాజనీతిశాస్త్ర విభాగ ఆచార్యులు ఇ.ఎ. నారాయణ, స్టూడెంట్ అఫైర్స్ డీన్‌గా న్యాయకళాశాల ఆచార్యులు ఎ.సుబ్రహ్మణ్యం, మీడియాసెల్ సమన్వయకర్తగా జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, ప్రెస్ పబ్లికేషన్స్ సంచాలకునిగా అర్థశాస్త్ర విభాగ ఆచార్యుడు టి.కోటీశ్వరరావులను నియమించారు.











