Auckland Aces beat KKR by 7 wickets
వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన నైట్ రైడర్స్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. గంభీర్ (5) మరోసారి విఫలమైనా… మెకల్లమ్ (35 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ బిస్లా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. అజహర్ మహమూద్ (3/16) వరుస బంతుల్లో కలిస్, మనోజ్ తివారీలను అవుట్ చేయడంతో ఐపీఎల్ చాంపియన్‌కు షాక్ తగిలింది. ఆక్లాండ్ ఏసెస్ జట్టు 17.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. ఓపెనర్ విన్సెంట్ (12 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ గుప్టిల్ (26 బంతుల్లో 25; 3 ఫోర్లు) నిలకడగా ఆడాడు. అజహర్ మహమూద్ (42 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అజహర్ మహమూద్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Kolkata Knight Riders’ chances of making the semifinals of the Champions League Twenty20 tournament suffered a major blow as they slumped to their second successive defeat after losing to Auckland Aces by seven wickets in a Group A match on Monday.
| Kolkata Knight Riders 137/6 (20.0 ov) |
| Auckland Aces 139/3 (17.4 ov) |
| Auckland Aces beat Kolkata Knight Riders by 7 wickets |












