Australian women beat England women by 4 runs

Australian women beat England women by 4 runsAustralia 142-4 (Cameron 45) beat England 138-9 (Jonassen 3-25) by 4 runs ICC Women’s World T20 2012, Final Report by Chetan Narula in Colombo. Australia became the first team to successfully defend the ICC Women’s World Twenty20 when they beat England by four runs in a tense final at the R. Premadasa Stadium in Colombo. They have now added the 2012 ICC Women’s World T20 to their 2010 prize won in the West Indies as well as their five 50-over World Cup titles.

ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ గెలుపు

కొలంబో: మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. 143 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆసీస్ బౌలర్లు జెస్ జొనసెన్ (3/25), స్టాలేకర్ (2/16), జూలీ హంటర్ (2/36) లు మూకుమ్మడిగా ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచారు. చివరి ఓవర్లో ఇంగ్లండ్ గెలిచేందుకు 16 పరుగులు అవసరం కాగా, 11 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచింది. 2 ఆసీస్ మహిళలు టి-20 ప్రపంచకప్ నెగ్గడం ఇది రెండో సారి. 2010లోనూ చాంపియన్‌గా నిలిచారు.

Print Friendly