చలికాలంలో కాళ్ళు, పాదాలు పగలకుండా మృదువుగా ఉంచే చిట్కాలు
గులాబీ నీళ్ళు, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడిగివేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి మృదువుగా మారతాయి.మడమలకున్న మురికి పోవాలంటే బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేయాలి. ఇలా చేస్తే క్రమంగా మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు.
నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దన చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడిగితే మృతకణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.పావు బకెట్ నీళ్ళలో చెంచా కొబ్బరి నూనె, చెంచా వంటసోడా,చెంచా విటమిన్ ఈ నూనె వేసి అరగంట సేపు కాళ్ళు అందులో ముంచేలా ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేయడం ద్వారా పాదాలు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకునే ముందు నువ్వులు నూనె గోరు వెచ్చగా వేడి చేసుకొని రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.
