Published On: Tue, Oct 16th, 2012

Cameraman Ganga tho Rambabu release on Oct 18

18న కెమెరామెన్‌ గంగతో రాంబాబు

cemara man gangato rambabuపవన్‌కళ్యాణ్‌-తమన్నా జంటగా నటించిన చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. యూనివర్శల్‌ మీడియా పతాకంపె సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. అక్టోబర్‌ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. నిర్మాత మాట్లాడుతూ పవన్‌ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో థియేటర్లలోకి వస్తున్న చిత్రమిది. డబ్బింగ్‌, రీరికార్డింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డిటిఎస్‌ మిక్సింగ్‌ చేస్తున్నాం. బ్లాక్‌బస్టర్‌ గబ్బర్‌సింగ్‌ ని ఈ సినిమా మించుతుందన్న నమ్మకముంది. ఇటీవల రిలీజ్‌ చేసిన ఆడియోకి, ట్రైలర్స్‌కి ప్రేక్షకాభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. Cameraman Ganga tho Rambabu release on Oct 18 | Cameraman Ganga Tho Rambabu is an upcoming Telugu film written and directed by Puri Jagannath. world movies

Print Friendly