రాష్ట్రంలో తగ్గిన సిమెంట్‌ ధరలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 50 కేజీల బస్తా ధర జులైలో రూ. 300ల దాకా వెళ్లింది. ప్రస్తుతం 230 నుంచి 240 ల మధ్య పలుకుతోంది. అంటే 60 వరకు తగ్గింది. జులై మొదట్లో గరిష్ఠ స్థాయికి చేరిన సిమెంట్‌ ధరలు జులై ఆఖరినుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. పొరుగు రాష్ట్రాల్లో బస్తా ధర 20 నుంచి 25 వరకు తగ్గింది. మన రాష్ట్రంలో ధర ఎక్కువగా తగ్గడానికి ఇసుక కొరత ప్రధాన కారణమైంది.

Cement prices down in Andhra Pradesh | Cement prices have dropped by Rs 60 a bag in Andhra Pradesh. especially in Andhra Pradesh. Cement prices fall in AP

Print Friendly