Published On: Fri, Jul 27th, 2012

Chiru song remix in ram charan movie

Chiru song remix in ram charan movieమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రీమిక్స్ లతో బిజీగా వున్నారు. తన తండ్రి నటించిన చిత్రాలలోని పాటలను రీమిక్స్ చేస్తే కలిసోస్తుండడంతో వి.వి.వినాయక్ దర్శకత్వంలో వస్తున్న అయన తన తాజా చిత్రంలో చిరంజీవి నటించిన చిత్రంలోని మరో పాటను రీమిక్స్ చేయనున్నారు. ఇంతకుముందు ‘మగధీర’ చిత్రంలో ‘బంగారు కోడిపెట్ట’ పాట, ‘రచ్చ’ చిత్రంలో ‘వానా వానా వెల్లువాయే’ పాటలను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు వినాయక్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో తన తండ్రి నటించిన కొండవీటి దొంగ చిత్రంలోని ‘శుభలేఖ రాసుకున్నా’ అనే పాటను రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ పాటపై చిరంజీవి, రాధా వేసిన స్టెప్పులు ఇప్పటికి అందరికి గుర్తుకువస్తాయి. అద్బుతంగా వారు ఈ పాటపై స్తేపులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ రీమిక్స్ సాంగ్ లో చరణ్, కాజల్ అగర్వాల్ స్టేపులు వేయనున్నట్లు సమాచారం.వినాయక్-చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో ప్రేక్షకులని అలరించనున్నారు. కాగా ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.జులై 20 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కోల్ కతాలో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Print Friendly