Published On: Thu, Oct 11th, 2012

Dance Academy guru Mahanti passed away

నాట్యాచార్యుడు మహంతి కన్నుమూత

Dance Academy guru Mahanti passed awayనాట్యకళాభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన ప్రముఖ నాట్యాచార్యుడు మహంతి వెంకటేశ్వరరావు(76) గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున విశాఖలో కన్నుమూశారు. పదేళ్ల వయస్సు నుంచి కళాసేవకు అంకితమైన వెంకటేశ్వరరావు విశాఖ నగరంలో నృత్య శిక్షణకు ప్రతీకగా నిలిచారు. 1969లో విశాఖలో స్థిరపడ్డ ఆయన ఉమామహేశ్వర నృత్య కళానికేతన్‌ను ప్రారంభించారు. 1985లో దానిని విశాఖ డాన్స్ అకాడమీగా మార్చి శిక్షణను నిరంతరాయంగా కొనసాగించారు. ఆయనకు భార్య లక్ష్మి, ఆరుగురు సంతానం ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న శిష్యప్రశిష్యులు, అభిమానులు, ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. Dance Academy guru Mahanti passed away | Famous Kuchipudi dancer Mahanti Venkateswara Rao passed away early today. classical dancer and founder of VDA

Print Friendly