ఎండిన పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
Dry fruits are considered rich source of nutrients and regarded as delicacies. Several fruits that come under dry fruits category are.
ఎండిన పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వల్ల అనేక వ్యాధులు నెమ్మదిస్తాయి. మరికొన్ని వ్యాధులకవి ఉపశమనంగానూ, నివారణ కోసం పనికి వస్తాయి.
ఎండు ఖర్జూర
ఎవరిలోనైనా చక్కెర పాళ్లు తక్కువగా (లో గ్లైసీమిక్ ఇండెక్స్) ఉండి బాగా నీరసంగా ఉండి, అన్నం దొరకని పరిస్థితుల్లో నిస్సత్తువ తగ్గించేందుకు వెంటనే ఎండు ఖర్జూరాలు తినాలి. వీటిలో ఉండే చక్కెర వల్ల ఒకటి రెండు ఎండు ఖర్జూరాలతోనే అన్నం తిన్నంత ఫలితం ఉంటుంది. అయితే వీటి వల్ల కడుపు నిండిన ఫీలింగ్ మాత్రం ఉండదు. అలా కడుపు నిండిన తృప్తి కలగాలంటే వెంటనే కొన్ని వాల్‌నట్స్ తినడం మంచిది.
ఎండు చెర్రీలు
మార్కెట్‌లో లభించే ఎండు చెర్రీలలోని యాంథోసయనిన్ అనే పోషకం వల్ల గౌట్, ఆర్థరైటిస్ సమస్యల కారణంగా కనిపించే ఎముకల్లో మంట, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్ నివారితమవుతాయి. ఇటీవలే మిషిగన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో ఎండు చెర్రీ పండ్లు త
