EAMCET 2012 BI.P.C Counselling & Allotment
ముగిసిన బీ-ఫార్మసీ కౌన్సెలింగ్
బీ-ఫార్మసీ కోర్సులో బైపీసీ విభాగం అభ్యర్థుల ప్రవేశానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవడంతో అధికారులు గురువారం సీట్ల కేటాయింపు జాబితా వెల్లడించారు. బైపీసీలో 78,473 మంది అర్హులుండగా.. 16,445 మందే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వీరిలో 15,372 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు. 278 కళాశాలల్లో 7,994 బీ-ఫార్మసీ సీట్లు నిండిపోయాయి. 7,378 మందికి సీట్లు దక్కలేదు. మరో 8 కళాశాలల్లో 330 బయో టెక్నాలజీ సీట్లుండగా.. 54 సీట్లు మాత్రమే నిండాయి. 276 సీట్లు మిగిలిపోయాయని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ చెప్పారు.












