Published On: Mon, Aug 6th, 2012

EAMCET 2012 Counseling Dates on 8th August 2012

8న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీల ప్రకటన

హైదరాబాద్ : ఈనెల 8వ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ యాభై శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయితేనే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఫీజుల నియంత్రణ మండలి తీరు సక్రమంగా లేదని, అందుకోసం చట్టం తీసుకొస్తామన్నారు. రూ.31 వేలు దాటి పెరిగే ఫీజును విద్యార్థులే భరించాలని మంత్రి తెలిపారు. విద్యార్థులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Print Friendly