Published On: Tue, Jul 31st, 2012

Gagan Narang bags bronze in 10m air rifle

ఒలంపిక్ క్రీడల్లో భారత్ బోణి 

Gagan Narang bags bronze in 10m air rifle ఒలంపిక్ క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో హైదరాబాద్ కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని భారత్ కు సాధించి పెట్టాడు. దాంతో ఒలంపిక్ పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరించింది. ఈ ఘనత సాధించగానే భారతీయ జెండా ఒలంపిక్స్ లో రెపరెపలాడింది. ఈ ఈవెంట్ లో నారంగ్ కు 701.1 పాయింట్లు లభించాయి.  వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ షూటర్లు భారత గౌరవాన్ని నిలబెట్టారు. అంచనాలకు తగ్గట్టుగా రాణించి హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ భారత్‌కు పతకాల బోణీ అందించాడు. వూల్‌విచ్‌లోని రాయల్ ఆర్టిలరీ బ్యారెక్స్‌లో సోమవారం జరిగిన 10మీ. ఎయిర్‌రైఫిల్ ఈవెంట్‌లో గగన్ నారంగ్ కాంస్యం గెలిచాడు. రుమేనియాకు చెందిన అలిన్ జార్జి మాల్డోవిను స్వర్ణం సాధించాడు. ఇటలీకి చెందిన నికోలో కాంప్రియాని రజతం నెగ్గాడు. లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడు నారంగ్. పతకం కూడా తనే మొదట సాధించడం విశేషం.

Gagan Narang bags bronze in 10m air rifle | Gagan Narang today opened India’s account in the London Olympic Games by clinching the bronze medal in 10m air rifle.

Print Friendly