Happy Ramadan to Ecoastalworld visitersరంజాన్‌ నెల ముస్లింలకు అత్యంత ప్రీతి పాతమైన నెల. ఈనెల లోనే ముస్లింలకు మతగ్రంధమైన ఖురాన్‌ ఉద్బవించిందని చెబుతారు.పేద గొప్ప తారతమ్యం లేకుండా మానవులంతా సమానులే అని చాటిచెపటానికే ఈ మాసం ఆవిర్బవించిందని చెబుతారు.శాంతి, సహజీవనంను పాటించడానికే రంజాన్‌ మాసం ఉపయోగపడుతుందని ముస్లింల నమ్మకం. ఉపవాసలద్వారా, ప్రార్ధన చేస్తూ, సహోదర ప్రేమకలిగి పేద,గొప్ప తేడాలేకుండా కలసి జీవిచడం వల్ల శత్రుభావం కొరవడుతుందని నమ్ముతారు.

దేవుడు మానవులకిచ్చిన ప్రతి చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలుపటం ముస్లిం జీవితంలో చాలా ముఖ్యం. ప్రతిరోజూ సాయంత్రం మస్‌జిద్‌లో ప్రార్దనలు జరిపిన తర్వాత దేవుని సమక్షంలో పేద ముస్లింలతో తినటం ఆశీర్వాదంగా భావిస్తారు. అదే సమయంలో అబద్దాలు చెప్పటం, బూతులు మాట్లాడటం, చెడ్డదృష్యాలు చూడటం, చెడ్డతలంపులను కలిగివుండటం, పుకార్లను వ్యాపింప చేయటం పాపంగా భావిస్తారు.ఈ పవిత్రమాసం లో ముస్లింలు మక్కా మస్‌జిద్‌ను దర్శించడాని ఇష్టపడతారు. మక్కా సౌదీ అరేబియాలో ఉంది. ఇది ప్రపంచంలోని ముస్లింలకందరికి పవిత్ర ప్రదేశంమైన కాబాలో ఉంటుంది. దీని వైశాల్యం 3,841,000 చతురపు అడుగులు. దీని లోపల బయట కలిపి 820,000 ముస్లింలు ప్రార్ధించే వీలుంటుంది. ఈ ప్రార్దనలనే హాజ్‌ అంటారు.  ఈ రంజాన్‌ పండుగ ప్రార్ధనలద్వారా దేశం శాంతి, సౌభాగ్య, సౌభ్రాతృత్యాలను పండిరచగలదని ఆశిద్దాం!

Print Friendly