Published On: Sat, Oct 13th, 2012

Haryana champions in HI junior women’s hockey

జాతీయ జూనియర్ మహిళల హాకీ చాంప్ హర్యానా

జాతీయ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన టైటిల్ పోరులో హర్యానా జట్టు 5-4 గోల్స్‌తో చండీగఢ్‌పై విజయం సాధించింది. హర్యానా తరఫున రీనా రాణి (55వ, 67వ ని.) రెండు గోల్స్ సాధించగా, నవజ్యోత్ కౌర్ (24వ ని.), నవనీత్ కౌర్ (44వ ని.) చెరో గోల్ చేశారు. చండీగఢ్ జట్టులో హర్దీప్ కౌర్ (3వ ని.), పూజారాణి (14వ, 59వ ని.), నవప్రీత్ కౌర్ (52వ ని.) గోల్స్ చేశారు. హర్యానా సెంటర్ ఫార్వర్డ్ క్రీడాకారిణి నవనీత్ కౌర్ ఈ టోర్నీలో 21 గోల్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డును అందుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో జార్ఖండ్ 3-2తో మధ్యప్రదేశ్ హాకీ అకాడమీపై గెలుపొందింది.

Host Haryana pipped Chandigarh 5-4 to win the second Hockey India Junior Women National Championship title, here today. In a high voltage clash, Haryana scored through Navjot Kaur (24th), Navneet Kaur (44th ), Reena Rani (55, 67) and an own goal in 16th minute, while for Chardigarh Hardeep Kaur (3rd), Pooja Rani (14th , 59th) and Navpreet Kaur (52th) were the goal-getters.

Print Friendly