Published On: Tue, Oct 2nd, 2012

Heavy rains in AP

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ప.గో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లజెర్లలోని రెండు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరటంతో 30 కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలించారు. ఉంగుటూరు మండలం పెద్దవెల్లిమిల్లలో వాగులో పడి వృద్ధుడు గల్లంతయ్యాడు.

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పరకాల దగ్గర 1200 ఎకరాలల్లో పత్తిపంట నీటమునిగింది. కురివి మండలం చింతపల్లిలో చెరువుకు గండి పడటంతో పంటపొలాలు నీటమునిగాయి. భూపాలపల్లిలో మోరంచవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Print Friendly