Published On: Thu, Oct 11th, 2012

ICET 2012 Counselling Starts from Tommorrow

రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్: గత మే 18న నిర్వహించిన ఐసెట్-2012 ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఐసెట్‌లో 1,21,532 మంది అర్హత సాధించగా.. 863 ఎంబీఏ కళాశాలల్లో 97,350 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా 534 ఎంసీఏ కళాశాలలుండగా.. 39,658 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సీట్ల కేటాయింపు ఈ నెల 21న ఉంటుందని, కళాశాలల్లో చేరేందుకు గడువు 27వ తేదీ అని తెలిపారు. తరగతులు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయి. కాగా రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్ ఈనెల 29, 30, 31 తేదీల్లో ఉంటుంది.

ICET 2012 Counselling Starts from Tommorrow | icet 2012 web options, M.B.A.,M.C.A. admissions schedule, icet 2012 allotment order at apicet.nic.in, icet2012

Print Friendly