ఐసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

apsche entrance test 2012ఐసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఎట్టకేలకు వెలువడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏడాది మే 18న ఐసెట్-2012 నిర్వహించారు. పరీక్ష ఫలితాలు జూన్ 11న విడుదలయ్యాయి. 1,28,404 మంది ఈ పరీక్షకు హాజరవగా.. 1,21,532 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి ఈనెల 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 15 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఐసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూలు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు http://apicet.nic.in లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను ఇంకా ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది.

ICET 2012 Web Counseling Notification | ICET – 2012 is an Integrated Common Entrance Test for admission into M.B.A. and M.C.A. courses in Andhra Pradesh.

Print Friendly