90 పరుగులతో భారీ విజయం
ప్రేమదాస స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 90 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. రోహిత్ శర్మ (33 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1సిక్సర్) దూకుడుకు తోడు విరాట్ కోహ్లి (32 బంతుల్లో 40; 6 ఫోర్లు), గంభీర్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత బౌలింగ్ ధాటికి 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. కీస్వెటర్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. హర్భజన్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, పఠాన్, చావ్లా చెరో 2 వికెట్లు తీశారు. India beat England by 90 runs in their Group A match in the ICC World Cup T20 series today at Premadasa Stadium in Colombo. Harbhajan, playing his first international match in over a year, took four for 12 in a brilliant spell of spin bowling with Piyush Chawla (2-13) partnering him.
