India beat New Zealand to enter U19 World Cup final
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. టోనీ ఐర్లాండ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ను భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
India beat New Zealand to enter U19 World Cup final | India beat New Zealand by 9 runs to enter the Under 19 World Cup final at Townsville, Australia. India will play Australia in the final.











