కోహ్లి సెంచరీతో లంకపై 3-1తో సిరీస్ విజయం
ప్రేమదాస మైదానంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో భారత్ నెగ్గింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను ధోని సేన 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (119 బంతుల్లో 128 నాటౌట్; ఫోర్లు 12; ఓ సిక్స్) కెరీర్‌లో 13వ సెంచరీతో మెరిశాడు. సురేశ్ రైనా (51 బంతుల్లో 58 నాటౌట్; ఫోర్లు 4 ఓ సిక్స్) అర్ధ సెంచరీతో మరోసారి ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ తీసుకుని నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులు చేసింది. తరంగ (73 బంతుల్లో 51; ఫోర్లు 4; ఓ సిక్స్), తిరిమన్నె (69 బంతుల్లో 47) రాణించారు. మనోజ్ తివారి నాలుగు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 42.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది.
వన్డే చరిత్రలో దేశానికి 400వ విజయం. విరాట్ కోహ్లి చేసిన సెంచరీ భారత్‌కు వన్డేల్లో 200వది.
India beat Sri Lanka by six wickets in Fourth ODI – Virat Kohli hugs Suresh Raina after India beat Sri Lanka by six-wickets to take an unbeatable 3-1 lead in the five-match ODI series
