Published On: Thu, Aug 16th, 2012

Indian Railways complaint number 8121281212

ట్రైన్‌లో పేలుడు  పదార్థాలు కనిపిస్తే ఫోన్ చేయండి: రైల్వే 

Indian Railways complaint number 8121281212రైళ్లలో ప్రయాణికులు తమ వెంట ఎలాంటి పేలుడు, మండే స్వభావం ఉన్న పదార్థాలను తీసుకెళ్లరాదని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి షకీల్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ట్రైన్‌లో ఎక్కడైనా పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ప్రయాణికులు వెంటనే 8121281212 నంబర్‌కు ఫోన్ చేసి ట్రైన్ పేరు, కోచ్ నంబర్, సీట్ నంబర్ వివరాలను తెలియజేయాలని కోరారు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా సమాచారాన్ని అందజేయవచ్చన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లలో పేలుడు పదార్థాల రవాణా నిషేధించినట్లు పేర్కొన్నారు. టపాసులు, బాణాసంచా, గన్‌పౌడర్, ఎల్‌పీజీ సిలిండర్‌లు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ వంటి వస్తువులను తరలిస్తే చట్టప్రకారం మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.

Indian Railways complaint number 8121281212 | Indian Railway Complaint Number – SMS complaints to 8121281212. Indian Railways Complaints can be SMS’ed

Print Friendly