నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

Indrakiladri Dasara Navarathrulu in APఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొమ్మిది రోజుల్లో 12లక్షల మంది దుర్గమ్మను దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందిలేకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. తొలిరోజు దుర్ముహూర్తం ఉండటంతో ఉదయం 9.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రిపై వరకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. దాదాపు రెండున్నర కిలోమీటర్లు క్యూలైన్‌లోనే నడవాల్సి ఉంటుంది.

Print Friendly