కసబ్కు ఉరిశిక్ష

Kasab will get death sentenceముంబయి పేలుళ్ల నిందితుడు కసబ్‌కు మరణశిక్ష తప్ప మరో శిక్ష లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కసబ్ పిటీషన్‌పై అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న అజ్మల్‌ కసబ్‌కు ఉరే సరి అంటూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల కేసులో సజీవంగా దొరికిన కసబ్, అప్పటినుంచి ముంబై ఆర్థర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చాలని కసబ్‌ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

Kasab will get death sentence | Pakistani terrorist Ajmal Kasab. The Supreme Court has upheld death penalty for 26/11 Mumbai attacks convict Ajmal Kasab.

Print Friendly