స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖ : పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఒడిశా నుంచి ఉత్తర కోస్తా మీదగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడ్డ ఈ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అలాగే ఉపరితల ఆవర్తనం కూడా కేంద్రీకృతమై ఉండటంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు లేదా ఉరుములుతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది.












