లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
తారాగణం : అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్, అమల, శ్రియ, అంజలా జవేరి తదితరులు. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. అలాగే శేఖర్ కమ్ముల బ్రాండ్‌తో రూపొందిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల చిత్రాలంటే క్లాస్‌టచ్‌తో పాటు కామన్‌మేన్‌ను కూడా టచ్ చేసే టేకింగ్, పాటలు, ఆహ్లాదకరమైన సంగీతం, సెంటిమెంట్ ఇలా ఒక్కొక్కటి కలబోసి కళ్ళముందు ఆవిష్కరిస్తాడు.
సన్‌షైన్ వ్యాలీ అనే కాలనీలో జరిగేకథ. తన ఇద్దరి చెల్లెళ్లను తీసుకుని అమ్మ(అమల) మాట ప్రకారం హైదరాబాద్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వస్తాడు శ్రీను(అభిజిత్). ఏడాది తర్వాత కలవమని కండిషన్ పెడుతుంది అమ్మ. కాలనీకి రాగానే చుట్టుపక్కల వారి పరిచయం, ఆటలపాటలతో పాటు చదువు వైపు దృష్టి పెట్టి శ్రీను జాబ్ సంపాదిస్తాడు. అతని చెల్లెలు ఎంసెట్ రాస్తుంది. చిన్నది ఇంగ్లీషు నేర్చుకుని కాన్వెంట్‌లో జాయిన్ అవుతుంది. అయితే అమ్మ పెట్టిన ఏడాది గడువు వెనుక రహస్యం ఏమిటన్నది సినిమా.
శ్రీనుకు నాగరాజ్(సుధాకర్), అభి (కౌశిక్), సత్య(రష్మి), లక్ష్మి(జారా), పద్దు(షగుణ్).. వీరంతా కాలనీలో పరిచయమవుతారు. క్రమేణా మంచి స్నేహితులుగా మారతారు. కొత్తవారందరూ తమ పరిధి మేరకే నటించారు. అమ్మ సెంటిమెంట్ సీన్స్‌లో శ్రీను బాగా పండించలేకపోయినా కథాపరంగా సాగిపోతుంది. బి గ్రేడ్ కాలనీ వీరిది. ఆ పక్కనే ఉన్న గోల్డెన్‌ఫేస్ కాలనీలో శ్రియ ఉంటుంది. ఆమెకు మిస్ బ్యూటీగా ఎంపికవ్వాలన్నది ఎయిమ్. అలాంటి ఆమెను తన ప్రవర్తనతో అభి(కౌశిక్) దగ్గరచేసుకుంటాడు. (ఈ పాత్ర హ్యాపీడేస్‌లో టైసన్‌ను పోలి ఉంటుంది). చదువు లేకపోయినా మనుషులుగా అందరికీ సాయం చేయడమే తత్త్వంగల పాత్రలో నాగరాజ్ ఇమిడిపోయాడు. కాకపోతే ఈ పాత్ర కూడా హ్యాపీడేస్‌తో నికిల్‌ను గుర్తుచేస్తుంది. ఆ కాలేజీలో ఉండి తన అందాలతో యువత గుండెల్లో అలజడి రేపే పాత్ర అంజలా జవేరిది. ఈ పాత్ర కూడా కమలీ ముఖర్జీని గుర్తుచేస్తుంది.కాగా, యువతకు చదువు, లక్ష్యం, ప్రేమ, ఆకర్షణ, పంతాలు, పట్టింపులు, రిచ్, పూర్, ఎక్కువ తక్కువ, చులకనలు, సాటిమనిషికి సాయపడే వ్యక్తులు, మధ్యతరగతి జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళు, ఇగోలు, అలకలు, ఆరాటాలు, పోరాటాలు, అమ్మమ్మ, నాన్నమ్మల ఆప్యాయానురాగాలు, అమ్మ మాతృత్వం వంటివన్నీ కలబోసి.. సగటు మనిషి నుంచి కోటీశ్వరుని వరకు అన్నీ సమానమేనని నిరూపించాడు శేఖర్ కమ్ముల. టోటల్‌గా ఇది ఆయన సినిమానే. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, రాసుకున్న ఉపకథలు, చిన్ననాటి చిలిపితనాలు, గిల్లిగజ్జాలు వంటివన్నీ పెయింటింగ్‌లా ఆవిష్కరించాడు.
అయితే, శేఖర్‌కమ్ముల చిత్రాల్లో ఉండే స్లో రన్ ఇందులో ఉంది. వనమాలి సాహిత్యం బాగా రాశాడు. అచ్చమైన తెలుగు పదాలతో, స్వచ్ఛమైన మెలోడీ బాణీలతో శేఖర్ కమ్ముల గత చిత్రాలను గుర్తుచేసినా ఈ కథకు ఇంతకంటే వేరే సంగీతం కానీ, సాహిత్యం కానీ ఊహించుకోలేం.దాదాపు చాలాకాలం తర్వాత అమల నటించిన పాత్ర మాతృదేవోభవలో మాధవి పాత్రనుగుర్తుకు తెస్తుంది. కేన్సర్ పేషెంట్‌గా ఆమె నటించింది. చావుబతుకుల మధ్య కొట్టుకునే ఆమెకు విల్ పవర్ ఉంటే సాధించవచ్చనే ధైర్యం పిల్లల ద్వారా, డాక్టర్ ద్వారా దర్శకుడు చూపించాడు.గోల్డెన్ ఫేస్ అయినా బి ఫేస్ అయినా ఎక్కడున్నా జీవితం బ్యూటిఫుల్‌గా ఉండాలంటే… కేవలం డబ్బు ఒక్కటే కారణం కాదు.. అంటూ… చెరువులు కబ్జా చేసినా.. మా జీవితాల్లో బ్యూటిఫుల్ రాదు. అనే ఒక్క డైలాగ్‌తో తనేం చెప్పాలనుకున్నాడో ఒక్కముక్కలో తేల్చేశాడు దర్శకుడు.
life is beautiful telugu review | Get information about Life Is Beautiful Telugu movie | Sekhar Kammula is back with Life is Beautiful | six youngsters
