Johannesburg: Highveld lions today defeated yorkshire comfortably by five wickets in a group b encounter of the ongoing champions league twenty20 here, which effectively dashed the hopes of two ipl teams, defending champions mumbai indian and chennai super kings. The lions victory means both mumbai indians and chennai super kings are out of the tournament, and later today’s ipl derby between the two sides have now been reduced to a dead rubber.
చాంపియన్స్ లీగ్ నుంచి ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతాతో పాటు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి లీగ్ దశతోనే ఇంటి ముఖం పట్టనున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ముగియకుండానే ఈ రెండు జట్ల ఆశలు గల్లంతయ్యాయి. దక్షిణాఫ్రికా జట్టు లయన్స్ మూడో విజయంతో సెమీస్‌కు చేరింది. ఈ గ్రూప్ నుంచి సిడ్నీ ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక భారత అభిమానుల ఒకే ఒక్క ఆశ ఢిల్లీ డేర్ డెవిల్స్. టోర్నీకి ముందు ఫేవరేట్‌గా భావించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు చాంపియన్స్ లీగ్‌లో నిరాశే ఎదురైంది. ముచ్చటగా మూడో విజయం సొంతం చేసుకున్న హైవెల్డ్ లయన్స్సి డ్నీ సిక్సర్స్‌తో పాటు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్-బిలో శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లయన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌పై గెలిచింది.
