ప్రభాస్ హీరోగా అందాలభామలు అనుష్క, రీచా గంగోపాధ్యాయలు హీరోయిను్లగా ప్రముఖ రచయిత కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్‌లు సంయుక్తంగా రూపొందిస్తున చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుం టోంది. ప్రస్తుతం రెండు పాటలు, మూడు ఫైట్స్ మిన హా టాకీ షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుం ది. ఈ చిత్రానికి కథాను సారం, ప్రభాస్ ఇమే జ్‌ను దృష్టి లో పెట్టు కొని అన్ని వర్గాల ప్రేక్ష కులని ఆకట్టుకునేలా ‘మిర్చి అనే టైటిల్‌ని ఖరారుచేశారు.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాముఅని అన్నారు.ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ, సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, సత్యం రాజేష్, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆర్ట్: ఏ.యస్. ప్రకాష్, కెమెరా: మది, కొరియోగ్రాఫర్స్: రాజు సుందరం, బృంద, రఘు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంక టేశ్వరరావ్ఞ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.
