Published On: Fri, Aug 3rd, 2012

Nehwal becomes first Indian to reach semi-final

సెమీస్‌కు చేరిన సైనా

Nehwal becomes first Indian to reach semi-finalహైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న సైనా సెమీఫైనల్ చేరి పతకంపై ఆశల్ని సజీవంగా నిలిపింది. తద్వారా ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన ఏకైక భారతీయురాలిగా రికార్డు పుటల్లోకి చేరింది. ఇక ఓ విజయం సాధిస్తే స్వర్ణం లేదా రజతం సైనా ఖాతాలో చేరిపోతుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడితే కాంస్య పతక పోరులో నెగ్గాల్సి ఉంటుంది. ఓ అడుగు ముందుకువేస్తే సైనా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వెంబ్లీ ఎరెనాలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగోసీడ్ సైనా 21-15, 22-20తో వరల్డ్ ఏడో ర్యాంకర్, ఏడోసీడ్ టిన్ బాన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది.

ప్రపంచ నంబర్‌వన్ యిహాన్ వాంగ్‌తో సెమీస్ నేడు 

సెమీఫైనల్స్ మధ్యాహ్నం గం. 1.30 నుంచి

Nehwal becomes first Indian to reach semi-final | Saina Nehwal of India dispatched Tina Baun of Denmark 21-15, 22-20 to reach the semi-final of the women’s singles badminton event.

Print Friendly