PGEC / PGECET – 2012 ADMISSIONS
ఎంటెక్, ఎంఫార్మసీలకు 8 నుంచి కౌన్సెలింగ్
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 8వ తేదీనుంచి 16వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు తెలిపారు. ఫార్మా.డి కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 4, 5, 6, 7వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల అవుతాయని వివరించారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గేట్/జీపాట్ అభ్యర్థులకు తొలిరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఇక పీజీఈసెట్ అభ్యర్థులకు 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను నిర్వహిస్తారు. పూర్తి వివరాలను http://pgecet.apsche.ac.in, appgecet.org వెబ్‌సైట్లలో పొందవచ్చు.
Post Graduate Engineering Common Entrance Test (PGECET) is AP State Level Common Entrance Test for admission into Regular PG Courses in Engineering, Technology, Architecture, Pharmacy and Planning (ME / M.Tech./ M.Pharmacy / M.Arch / M. Tech. / M. Plg./ Graduate level Pharm-D (Post Baccalaureate) courses for the academic year 2012-2013 conducted by University College of Engineering, Osmania University on behalf of A.P. State Council of Higher Education (APSCHE), a statutory Body of the Government of A.P., Hyderabad.
4 నుంచి ఫార్మాడి కౌన్సెలింగ్
ఫార్మా.డి కోర్సులో ప్రవేశాలకు ఎంపీసీ వారికి 4, 5 తేదీల్లో, బైపీపీ వారికి 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపడతామని ప్రవేశాల క్యాంపు ఆఫీసర్ రఘునాధ్ వెల్లడించారు. వివరాలను ఎంపీసీవారు http://apeamcet.nic.in వెబ్‌సైట్‌లో, బైపీసీ వారు http:// apeamcetb.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఎంపీసీ వారికి 6వ తేదీన, బైపీసీ వారికి 8వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు.












