ప్రస్తుతం మాస్ మహరాజా హిట్స్‌లేక అల్లాడిపోతున్నాడు. అయినా సినిమాలు రావడం మామూలే. నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో ఏదో కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించారు. ఆయన సూచన మేరకు ఇటీవలే అసిస్టెంట్ డైరెక్టర్ కోటి ఓ కథను తీసుకువచ్చాడు. అది విక్రమార్కుడుకు సీక్వెల్‌లా అనిపించింది. దాంతో కథను డెవలప్ చేసి రవితేజ ముందుంచాడు.
ఫిలింనగర్ కథనం ప్రకారం త్వరలో ఆ చిత్రం సెట్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘జింతాత జింతాత’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆల్‌ఱెడీ విక్రమార్కుడులో జింతాత అనే పాట పెద్ద ఫేమస్ అయింది. వారాహి చిత్రంపై అందాల రాక్షసి నిర్మించిన సాయి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
