Serena Williams wins 4th US Open singles title
టెన్నిస్‌లో సెరెనా హవా
టెన్నిస్‌లో ఈ సంవత్సరం సెరెనా హవా నడుస్తోంది. మంచి జోరుమీదున్న ఈ బ్లాక్‌బ్యూటీ వింబుల్డన్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌తోపాటు, ఒలింపిక్స్‌లోని సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు దక్కించుకుంది. అదే ఊపులో సెరెనా యూఎస్ ఓపెన్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకాపై 6-2, 2-6, 7-5 సెట్ల తేడాతో విజయం సాధించింది. తన కెరీర్‌లో నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్‌తోపాటు మొత్తంగా 15 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ సాధించి సెరినా… పీట్ సంప్రాస్ రికార్డును బ్రేక్ చేసింది. ఒకే సంవత్సరంలో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. 2002లోను కూడా సెరినా రికార్డు సాధించారు. 31 సంవత్సరాల వయసులోను మంచి జోరుమీదున్న ఆమె ప్రస్తుతం నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. యూఎస్ ఓపెన్‌లో ఓడినా అజరెంకా మాత్రం నెంబర్‌వన్ స్థానాన్ని మాత్రం కాపాడుకుంది.
Serena Williams wins 4th US Open singles title | Serena Williams overcomes world number one Victoria Azarenka in three sets to win her fourth US Open and 16th Grand Slam title.












