స్పైసీ చికెన్ ఫ్రైడ్ రోల్స్
కావలసినవి
* చికెన్ : 1/2kg
* మైదా పిండి : 1/2kg
* గుడ్డు : 1
* క్యాబేజి తురుము: 1cup
* బీన్స్ : 1cup
* క్యారెట్ : 1cup
* కారం : 1tsp
* నూనె : తగినంత
* ఉల్లిపాయ : 1
* కొత్తిమీర తురుము: 2tbsp
* ఉప్పు : రుచికితగినంత
తయారు చేయు విధానం:
ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి బాగా కలపాలి. తర్వాత చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి. దీన్ని తడిగుడ్డతో కప్పి అరగంట సేపు ఉంచాలి. ఇంతలో మసాలా సామాగ్రిని తయారు చేసుకోవాలి. చికెన్‌ను ఉడకబెట్టుకోవాలి. కూరలను, చికెన్‌ను సన్నని పొడుగాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉల్లి ముక్కలు, బీన్స్, క్యాబేజి, క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పులను వేసి చికెన్‌ను ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించి దించాలి. తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసి వత్తి అందులో చికెన్ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి. ఈ రోల్స్ ను వేడిగా కాగే నూనెలో వేసి దోరగా వేయించి, దించాలి. అంతే చికెన్ ఫ్రైడ్ రోల్స్ రెడీ.
