Varsity teachers to strike from August 16
నేటి నుంచి వర్సిటీ అధ్యాపకుల సమ్మె
ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్స్(అఫుటా) ఆధ్వర్యంలో వర్సిటీ అధ్యాపకులు గురువారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. తమ సమస్యలపై దాదాపు ఏడెనిమిది నెలలుగా పోరాడుతున్నా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో తాము సమ్మె నిర్ణయం తీసుకొన్నామని అఫుటా బుధవారం పేర్కొంది. పెరిగిన యూజీసీ వేతన స్కేళ్లకు అనుగుణంగా వేతన, పెన్షన్ బకాయిలు చెల్లించాలని, పదవీ విరమణ వయస్సు పొడిగించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.











