VVS Laxman, who won many a match for India అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో ఆయన హైదరాబాదులో న్యూజిలాండ్‌తో ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచులో కూడా ఆడబోనని ఆయన చెప్పకనే చెప్పేశారు. క్రికెట్ ద్వాతా దేశప్రతిష్టను పెంచడానికి శాయశక్తులా కృషి చేశానని ఆయన చెప్పారు. క్రికెట్‌కు 16 ఏళ్ల పాటు సేవలు అందించానని, రిటైర్మెంట్‌కు ఇదే తగిన సమయమని భావిస్తున్నానని ఆయన అన్నారు.క్రికెట్‌ను దేశానికి సేవ చేయడానికి అవకాశంగా భావించినట్లు ఆయన తెలిపారు. క్రికెట్ ద్వారా దేశ గౌరవాన్ని పెంచేందుకు తాను కృషి చేశానని ఆయన అన్నారు. భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. జూనియర్లకు అడ్డుగా ఉండకూడదని, వారికి అవకాశం కల్పించాలని భావించి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. క్రికెట్ యాత్రలో తనకు ఎంతో మంది సహకరించారని ఆయన చెప్పారు. క్రికెట్‌లో రాణించేందుకు తన భార్య ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. క్రికెట్ సభ్యులతో గడిపిన క్షణాలు మరువలేనివని ఆయన అన్నారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సిఎకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రిటైర్మెంట్ ప్రకటించడం కఠిన నిర్ణయమే అని ఆయన అన్నారు. 17 ఏళ్ల వయస్సులో క్రికెటర్ కావాలని అనిపించిందని ఆయన అన్నారు. తాను తప్పుకుంటున్నాననే విషయం సెలెక్టర్లకు ఈ ఉదయమే చెప్పినట్లు ఆయన తెలిపారు. నిర్ణయం ప్రకటించడానికి నాలుగైదు గంటల ముందు చాలా ఉద్వేగానికి గురైనట్లు ఆయన తెలిపారు. తన వ్యక్తిగత విజయాల కన్నా జట్టు ప్రయోజానాలకే తాను ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రిటైర్మెంట్ బాధాకరమేనని, మరి కొంత కాలం ఆడే అవకాశాలున్నా ఇదే రిటైర్మెంట్‌కు సరైన సమయమని భావించానని ఆనయ చెప్పారు. లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తనను ఇంతవాడ్ని చేశారని ఆయన చెప్పారు.డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం మరిచిపోలేనిది అని ఆయన అన్నారు.
Print Friendly