welcome to Saina Nehwal
సైనాకు ఘన స్వాగతం
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తండ్రి హర్‌వీర్ సింగ్, కోచ్ గోపిచంద్‌తో నగరానికి చేరుకున్న సైనాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ద్వారా ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న సైనా ఆ తర్వాత హైదరబాద్‌కు వచ్చింది.
బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సైనా రికార్డ్ సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత ఒలింపిక్స్ పతకం అందుకున్న రెండవ మహిళ సైనా కావటం విశేషం.
Indian badminton star Saina Nehwal was today given rousing receptions in New Delhi and her hometown Hyderabad after winning a historic bronze medal at the London Olympics.












