West indies beat New Zealand by 9 wickets in 1st test
విండీస్ ఘన విజయుం
న్యూజిలాండ్‌తో జరిగిన తొలిటెస్టులో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయుం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన గేల్ (49 బంతుల్లో 64 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లో అజేయు అర్ధసెంచరీతో జట్టును గెలిపించాడు. ఆదివారం 199/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఆటప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 272 పరుగుల వద్ద ఆలౌటైంది. విండీస్ బౌలర్లు కీవుర్ రోచ్ 5, సునీల్ నరైన్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగుల ఆధిక్యం పొందిన విండీస్ 102 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. నరైన్‌కు ‘మాన్ ఆఫ్ ది వ్యూచ్’ లభించింది.చివరి టెస్టు వచ్చేనెల 2 నుంచి జరుగుతుంది.
West indies beat New Zealand by 9 wickets in 1st test | A five-wicket haul for Kemar Roach and an unbeaten 64 from opener Chris Gayle saw West Indies beat New Zealand by nine wickets on Sunday












