Darren Sammy’s West Indies were crowned the new World Twenty20 champions on Sunday after a 36-run victory over hosts Sri Lanka in a dramatic final in Colombo on Sunday. The West Indies, restricted to 137/6 after electing to bat, hit back to bowl Sri Lanka out for 101 and silence a sell-out crowd of 35,000 at the Premadasa stadium that included President Mahinda Rajapakse. It was the first world title for the West Indies since the 50-over World Cup triumph under Clive Lloyd in 1979, and handed Sri Lanka their fourth defeat in a major final since 2007. Sri Lanka have now lost two successive 50-over World Cup finals in 2007 and 2011 and two World Twenty20 finals in 2009 and 2012.
ఫైనల్లో చిత్తయిన శ్రీలంక
ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఒక దశలో 48/1 స్కోరుతో ఉన్న శ్రీలంక 21 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి సొంత ప్రేక్షకుల ముందు చిత్తుగా ఓడింది. 18.4 ఓవర్లలో 101 పరుగులు మాత్రమే చేసి ఆ జట్టు ఆలౌటైంది. శామ్యూల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, షేన్ వాట్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
మూడు దశాబ్దాల తర్వాత విండీస్ వీరులు ప్రపంచ చాంపియన్లు అయ్యారు. కొలంబోలో ఆదివారం జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ 36 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 33 ఏళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌గా నిలిచి గత వైభవంతోనే ఇన్నాళ్లూ నెట్టుకొస్తున్న ఆ దేశం ఇప్పుడు మరోసారి విశ్వ విజేతగా నిలిచింది.
