వెస్టిండీస్‌ శుభారంభం మహిళల టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ

గ్రూప్‌-బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌కు ముందుగా బ్యాటింగ్‌ అప్పగించిన విండీస్‌ 117 పరుగులకు పరిమితం చేసింది. ఓపెనర్లు బట్స్‌ (32), వెయిట్‌ (15), దివైన్‌ (11) ఆరంభంలో పరవాలేదనిపించినా తర్వాత బ్యాట్‌వుమెన్‌ పెవీలియన్‌కు క్యూకట్టడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 117 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్‌ టేలర్‌ (35) అద్భుతమైన ఆరంభాన్నిచ్చింది. మరో ఇద్దరు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ వుమెన్‌ స్మార్ట్‌, డాలే పరుగులేమీ చేయకుండనే వెనుదిరిగి పన్పటికీ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డొట్టిన్‌ (58), అజేయ శతకానికి అగులైరియా (10) సహకారం తోడవ్వడంతో 18 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగిసింది.దీంతో విండీస్‌కు 7 వికెట్ల తేడాతో విజయం సొంతమయింది.

West Indies women beat new Zealand in World T20 |  West Indies women are off to a flyer at the ICC World Twenty20 championship in Sri Lanka. They beaten 2010 finalist New Zealand by 7 wickets with two Overs to spare.

భారత్‌ తొలి మ్యాచ్‌ నేడు ఆస్ట్రేలియాతో

Print Friendly