Written test for jail warder posts
రాష్ట్ర జైళ్లశాఖలో వార్డర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న రాత పరీక్షను నిర్వహిస్తున్నట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఎం.మాలకొండయ్య శనివారం తెలిపారు. గతేడాది డిసెంబర్ 26న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పురుషులు పోస్టులు 692కు, మహిళా వార్డర్ 39 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.దరఖాస్తు చేసుకున్న వారిలో 17,178 మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. అర్హులైన వారందరికీ హాల్‌టికెట్లు పంపామని మాలకొండయ్య తెలిపారు. రాత పరీక్షకు అర్హత సాధించినవారి జాబితాను www.apstatepolice.org లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.Jail warder written test will be conducted on August 26 for men and women candidates. The test will be for those who have qualified in physical fitness tests, kadapa SP manish kumar sinha said on thursday. It will be held at KORM college of engineering on kadapa pulivendula road at 7 am.












